- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా పరిస్థితి ఎవరికీ రాకూడదు.. నారా భువనేశ్వరి సంచలన లేఖ
దిశ, వెబ్డెస్క్: ఏపీ రాజకీయాల్లో నారా భువనేశ్వరి వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో తన భార్యను అవమానించే విధంగా వైసీపీ నేతలు మాట్లాడారంటూ చంద్రబాబు మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు చంద్రబాబు దొంగ కన్నీరు కారుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల నడుమ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు కూడా వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలో శుక్రవారం నారా భువనేశ్వరి ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాసింది.
‘ఏపీ అసెంబ్లీలో నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానం మీ ఇంట్లో వారికి జరిగినట్టుగా భావించారు. మీరిచ్చిన అండను నేను జీవితంలో మర్చిపోలేను. చిన్ననాటి నుంచి అమ్మ, నాన్నలు విలువలతో పెంచారు. అలా విలువలతో కూడిన సమాజం కోసమే అందరూ కృషి చేయాలి తప్పా.. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడకూడదు. నాకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదు’ అంటూ నారా భువనేశ్వరి ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
- Tags
- ap politics