ఇది సరైన పద్ధతి కాదు : నందమూరి కల్యాణ్ రామ్

by Anukaran |   ( Updated:2021-11-20 07:13:43.0  )
Nandamuri Kalyan Ram
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరికి జరిగిన అవమానంపై ప్రముఖ హీరో నందమూరి కల్యాణ్ రామ్ స్పందించారు. ఈ మేరకు కల్యాణ్ రామ్ శనివారం ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి, వాటి పరిష్కారం కోసం పాటుపడే దేవాలయం వంటిది. అక్కడ చాలామంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడటం అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నాను. పూజ్యులు తాతగారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం.’’ అని కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story