‘ఇలాంటి కల్లోల పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు’

by srinivas |
‘ఇలాంటి కల్లోల పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు’
X

కోవిడ్-19(కరోనా వైరస్) పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తూ అనేక మందిని బలితీసుకుంటున్నది. అయితే ఈ వ్యాధి పట్ల కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అవగాహన కల్పించడంతో పాటు అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. దీనికి తోడు సినీ ఇండస్ర్టీకి చెందిన వారు కూడా స్పందిస్తూ, వారికి తోచిన విధంగా విరాళాలు కూడా ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రకథానాయకులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు. కరోనా మహామ్మారిపై పోరాటంలో ఎంతో మంది వైద్యులు పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ శక్తి మించి పనిచేస్తున్నారు. వారి కఠోర శ్రమకు సెల్యూట్ అని బాలకృష్ణ అన్నారు. ఇంతకు ముందు ప్రపంచం ఇలాంటి కల్లోల పరిస్థితిని ఎపుడు చూడలేదు. కరోనా మహామ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో మనమందరం బాధ్యతయుతమైన పౌరులుగా మెలగాలని పిలుపునిచ్చారు.

Tags: MLA Nandamuri Balakrishna, reacts, coronavirus, doctors efforts

Advertisement

Next Story

Most Viewed