- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ పగ్గాలు జూ.ఎన్టీఆర్‌కి.? బాలయ్య ఏమన్నారంటే
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. పరిస్థితి ఇలానే ఉంటే రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జూ.ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే మళ్లీ టీడీపీ పుంజుకుంటుందని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఇలాంటి తరుణంలో జూ.ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రంపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుట్టిన రోజు సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ బాలయ్యను ఇంటర్వ్యూ చేసింది.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా.? ఆయనకు పగ్గాలు ఇస్తారా అని ప్రశ్నించగా ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాలు వాళ్లవి. ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారా.? లేదా.? అనే విషయాన్ని తాను పెద్దగా ఆలోచించడం లేదని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఒకవేళ జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే అది పార్టీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారా.? అన్న ప్రశ్నకు తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ప్లస్ అయి.. తర్వాత మైనస్ అయితే అంటూ ఎదురు ప్రశ్నవేశారు. తెలుగుదేశం పార్టీ ఓ ఆవేశంలో నుంచి పుట్టిందని.. పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడూ పారదర్శకంగా ఉంటారని తెలిపారు. ఇక అలాంటివారికే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని బాలకృష్ణ వివరించారు.
ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సైతం జూ.ఎన్టీఆర్ అభిమానుల నుంచి సెగ తగిలింది. కుప్పం పర్యటనలో జూ.ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారంటూ అభిమానులు ఆయనను నిలదీశారు. జై జూ.ఎన్టీఆర్ అంటూ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కేకలు వేశారు. అంతేకాదు జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కుప్పంలో జెండా ఎగురవేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా అభిమానులు జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
గతంలో కూడా జూ.ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా పార్టీ కార్యకర్తగా తాను అండగా ఉంటానని తెలిపారు. ఇప్పుడు అవే వ్యాఖ్యలను కార్యకర్తలు, అభిమానులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఏపీ మంత్రి కొడాలి నాని సైతం జూ.ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు ఇస్తే టీడీపీ బతుకుతుందని లేదంటే అంతేనని గతంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జూ.ఎన్టీఆర్ రాకను ఆహ్వానిస్తున్నారు. మరి అభిమానుల కోరికను జూ.ఎన్టీఆర్ స్వాగతిస్తారా లేక సినిమాలవైపే మెుగ్గు చూపుతారా అనేది కాలమే నిర్ణయించాలి.