- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈద్గాల వద్ద ప్రార్ధనలకు అనుమతి లేదు
దిశ ప్రతినిధి, నల్లగొండ: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బక్రీద్ రోజున ఈద్గాల వద్ద సామూహికంగా ప్రార్ధనలు నిర్వహించుకోవడానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈద్గాల వద్ద ప్రార్ధనలు నిర్వహించడాన్ని అనుమతించడం లేదన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి వీలుగా అందరూ తమ తమ ఇండ్లలోనే ప్రార్ధనలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. కరోనా కట్టడి కోసం ప్రజలంతా పోలీస్ శాఖతో అందరూ సహకరించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మత పెద్దలకు సైతం కరోనా విజృంభిస్తున్న పరిస్థితులను వివరిస్తున్నామని తెలిపారు. పవిత్ర బక్రీద్ పర్వదినోత్సవాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని, కరోనా మహమ్మారిని తరిమికొట్టేలా భగవంతుడిని ప్రార్ధించాలని ఎస్పీ రంగనాథ్ కోరారు.