విశాఖలో దిగంబర దొంగ అరెస్ట్..!

by Anukaran |   ( Updated:2020-09-12 08:07:54.0  )
విశాఖలో దిగంబర దొంగ అరెస్ట్..!
X

దిశ, వెబ్‎డెస్క్: విశాఖలో దిగంబర దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా మర్రిపాలెం ఉడా కాలనీలోని నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగను ఎట్టకేలకు శనివారం అరెస్ట్ చేశారు.

దిగంబర దొంగ గుంటూరు జిల్లాకు చెందిన కంచర్ల మోహనరావుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి ఆరు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. మోహన్‎పై గతంలో 60కి పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed