కంగనాకు నోటీసులు ఎందుకు రాలేదు : నగ్మా

by Jakkula Samataha |
కంగనాకు నోటీసులు ఎందుకు రాలేదు : నగ్మా
X

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో రోజుకో అంశం తెరపైకి వస్తోంది. రియా చక్రవర్తి విషయం నుంచి మొన్న జరిగిన అనురాగ్ కశ్యప్, పాయల్ ఘోష్ ఇష్యూ వరకు ప్రతీ విషయంలోనూ రచ్చ జరుగుతూనే ఉంది. డ్రగ్స్ విషయంలో ఈ రచ్చ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్.. బాలీవుడ్ బండారం బయటపెడతానని, తనకు సపోర్ట్, ప్రొటెక్షన్ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్‌ను కోరిన విషయం తెలిసిందే.

అయితే, సెప్టెంబర్ 23న డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉందంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లకు నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ నగ్మా ఎన్‌సీబీని ప్రశ్నిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. ఇంతమంది హీరోయిన్లు డ్రగ్స్ తీసుకున్నారో లేదో తెలియదు కానీ, వాట్సాప్ చాట్ ద్వారా నిర్ధారణకు వచ్చి సమన్లు జారీ చేశారని.. తాను గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు స్వయంగా ఒప్పుకున్నప్పటికీ.. కంగనాకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని అడిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పని.. టాప్ ప్లేస్‌లో ఉన్న నటీమణుల గురించిన సమాచారం మీడియాకు లీక్ చేయడమేనా? అని ప్రశ్నించింది.

సెంట్రల్ గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన నటీనటులను కేసుల్లో ఇరికించి ప్రతీకారం తీర్చుకుంటున్నారని.. అదే అనుకూలంగా మాట్లాడినప్పుడు తప్పు చేసినా సరే, వారికి ఎలాంటి శిక్ష ఉండబోదని ప్రభుత్వమే స్వయంగా చెప్తున్నట్లు ఉందని విమర్శించింది నగ్మా.

Advertisement

Next Story