యాదాద్రి ఆలయానికి దానం నాగేందర్ విరాళం

by Anukaran |   ( Updated:2021-10-21 03:00:46.0  )
యాదాద్రి ఆలయానికి దానం నాగేందర్ విరాళం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ నిర్మాణానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి వినియోగించుకునే అవసరం కోసం ఈ బంగారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తలా కిలో చొప్పున బంగారాన్ని విరాళంగా ప్రకటించగా .. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి చెందిన దానం నాగేందర్ కూడా ముందుకొచ్చారు.

యాదాద్రి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం 125 కిలోల బంగారం అవసరం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి స్వచ్ఛంధంగా దాతలు ముందుకొచ్చి బంగారాన్ని ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా దానం నాగేందర్ తన వంతు సాయంగా కిలో బంగారాన్ని ప్రకటించారు.

Advertisement

Next Story