టీఆర్‌ఎస్ నేత హత్యకు వీళ్లే కారకులు..

by Shyam |   ( Updated:2020-08-22 09:42:29.0  )
టీఆర్‌ఎస్ నేత హత్యకు వీళ్లే కారకులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : కొడంగల్ టీఆర్ఎస్ నేత నాగరాజు గౌడ్ మర్డర్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆయన మృతికి భార్య, ప్రియుడు, అతని కొడుకే కారణమని తేలడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు హత్యకు భార్య, ప్రియుడు, కొడుకు కలిసి ప్లాన్ వేసినట్లు విచారణలో వెల్లడైందని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.

టీఆర్‌ఎస్ లీడర్ నాగరాజు గౌడ్ హత్యకు సంబంధించిన వివరాలను శనివారం ఆయన మీడియాకు వెల్లడించారు.ఆయన హత్యకు భార్య వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. భార్య, ఆమె ప్రియుడు, కుమారుడు ముగ్గురు కలిసి పక్కా పథకం ప్రకారమే నిద్రిస్తున్న నాగరాజు తలపై ఇనుప రాడ్‌తో బాది హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని మూడో కంటికి తెలియకుండా చెరువులో పడేశారు. ఇదిలాఉండగా, ఈనెల14వ తేదీన తన తండ్రి కనిపించడం లేదని నాగరాజు కూతురు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లిపై ఆమె అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ మేరకు విచారణ చేపట్టారు. తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా నిందితులు నేరం అంగీకరించినట్లు తేలింది. దీంతో ఆ ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.

Advertisement

Next Story