నాగాలాండ్ మంత్రి చాంగ్ మృతి

by Shamantha N |
నాగాలాండ్ మంత్రి చాంగ్ మృతి
X

దిశ, వెబ్‎డెస్క్: నాగాలాండ్‌ రాష్ట్రానికి చెందిన మంత్రి సీఎం చాంగ్‌ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నాగా హాస్పిటల్ అథారిటీ కొహిమా (ఎన్ఎచ్ఎకే)లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

నోక్లెక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన చాంగ్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి, మాజీ ఎంపీ. 2018 నుంచి నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)లో ఉన్న ఆయన.. ప్రస్తుత ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ, వాతావరణం, న్యాయ శాఖల మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రి చాంగ్ మరణం ప్రభుత్వానికి తీరని లోటని రాష్ట్ర సీఎం సలహాదారుడైన అబు మెహతా ట్విట్టర్‌లో తెలిపారు. ప్రభుత్వానికి తీరని లోటని అన్నారు. చాంగ్ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story