- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పవన్ కల్యాణ్ చాలా దెబ్బలు కొట్టారు: నాగబాబు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా దెబ్బలు కొట్టారని బండరాయి బద్దలయ్యే రోజు వస్తుందని ప్రముఖ సినీ నటుడు నాగబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, బండరాయి మీద ఓ దెబ్బేస్తే అది పగలదు. 99 దెబ్బలేసినా పగలదు.. 100వ దెబ్బేస్తే పగులుతుంది అన్నారు.
అలాగే మన పవన్ కల్యాణ్.. మన ప్రెసిడెంట్ కుళ్లిన రాజకీయాలపై చాలా దెబ్బలు కొట్టారన్నారు. కుళ్లిన రాజకీయాలనే బండరాయి బద్దలయ్యే రోజు వస్తుందని ఆయన పేర్కొన్నారు. మరో నాలుగేళ్లలో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్నవారిని తన్నడం, కత్తులతో పొడవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అధికార పార్టీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్ని బెదిరింపులు ఎదురైనా స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారని కార్యకర్తలను అభినందించారు. ఇటువంటి బెదిరింపులు మామూలేనని, ఎవరూ భయపడాల్సిన పని లేదని ఆయన పిలుపునిచ్చారు. ఎందుకంటే హిట్లర్ కంటే గొప్పోడెవడూ లేడని, అలాంటి హిట్లరే పతనమైపోయాడని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత అధికార పార్టీ అరాచకం అంతమయ్యేందుకు కూడా ఎంతో కాలం పట్టదని ఆయన జోస్యం చెప్పారు.
tags : janasena, first anniversary, rajahmundry, nagababu