నాస్తికుడినే అయినా హిందూయిజం ఇష్టం

by Anukaran |   ( Updated:2020-07-25 09:08:47.0  )
నాస్తికుడినే అయినా హిందూయిజం ఇష్టం
X

దిశ ఏపీ బ్యూరో: నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు బీజేపీతో పొత్తు కుదిరిన నాటి నుంచి హిందూ సమాజాన్ని ఆకట్టుకునేందుకు ఒక్కో వాదనతో ముందుకు వస్తూ నాస్తిక సమాజంతో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తాను నాస్తికుడ్నయినా కొన్ని మతాలపై తన అభిప్రాయాలు చెప్పదలచుకున్నానని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాను హిందూమతాన్ని గౌరవిస్తానని అన్నారు.

దానికి కారణమేంటంటే.. “ఈశ్వరుడు ఒక్కడే అని నమ్మినా, అనేక దేవతలు ఉన్నారని నమ్మినా, విగ్రహారాధనను నమ్మినా, ఇతర మతాలను నమ్మినా, అసలు దేవుడే లేడని చెప్పే నాస్తికులను సైతం ఎవరినీ నిందించని మతం హిందూమతం. హిందూమతం మనిషిని మనిషిగా బతకమని చెబుతుంది. ఇతర మతాలతో సఖ్యంగా ఉండమని చెబుతుంది. అంతేతప్ప…నీ మతం కానివాడిని చంపెయ్యి, విగ్రహారాధన చేసేవాళ్లు నరకానికి పోతారు, మా దేవుడే నిజమైన దేవుడు మీ దేవుడు చెడ్డవాడు అంటూ పిచ్చిమాటలు చెప్పదు… అందుకే హిందూయిజం అంటే నాకు గౌరవం… కానీ నేను నాస్తికుడ్ని” అని పేర్కొన్నారు.

Advertisement

Next Story