- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహాత్ముడు ఉండుంటే ఏమనేవారో తెలుసా ?
సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య నాథురాం గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపగా.. తాజాగా మహాత్మాగాంధీ గురించి కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు.
https://twitter.com/NagaBabuOffl/status/1263905316292321280?s=20
ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహా రావు, అబ్దుల్ కలాం, సావర్కర్, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉందన్నారు. ఎందుకంటే ‘స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం మర్చిపోకూడదని నా ఆశ’ అంటూ ట్వీట్ చేశారు.
గాంధీ బతికుంటే.. ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారన్నారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప వారి ముఖాలు గుర్తురావడం లేదన్నారు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.