విడిపోయిన భార్యాభర్తలతో అక్కినేని హీరో.. ఫోటో వైరల్

by Shyam |   ( Updated:2021-07-09 07:22:11.0  )
lal singh chadda
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న ”లాల్ సింగ్ చద్దా” చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో కనిపించనున్నాడని సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల సమంత ‘ఫ్యామిలీ మ్యాన్’ తో బాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వగా, చైతూ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నట్లు వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎట్టకేలకు ఈ అక్కినేని హీరో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాడు.

తాజాగా “లాల్ సింగ్ చద్దా” షూటింగ్ లో పాల్గొన్న నాగ చైతన్య ఓ ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని కంఫర్మ్ చేశారు. ఇక ఫొటోలో నాగ చైతన్య, అమీర్ ఖాన్ మిలిటరీ డ్రెస్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో అమీర్ రెండో భార్య కిరణ్ రావు ఉండడం విశేషం. ఇటీవల వారిద్దరూ విడాకులు తీసుకొని దూరమైన విషయం తెలిసిందే. 15ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు ప్రకటించి అమీర్, కిరణ్ జంట.. ఇకపై స్నేహితులుగా కొనసాగుతామని, సినిమాల విషయంలో తామెప్పుడూ ప్రొఫెషనల్ గానే ఉంటామని తెలిపారు. చెప్పినట్లుగానే ఇద్దరూ కలిసి వర్క్ చేస్తూ ఫ్రెండ్స్ గా ఉంటున్నారని ఈ పిక్ చూస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లడఖ్ లో జరుగుతుంది. ఇక ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

Next Story