‘నాట్యం’కు అరుదైన గౌరవం.. వారందరికీ సమాధానం దొరికింది: సంధ్యారాజు

by Shyam |
‘నాట్యం’కు అరుదైన గౌరవం.. వారందరికీ సమాధానం దొరికింది: సంధ్యారాజు
X

దిశ, సినిమా: ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సంధ్యారాజు స్వయంగా నిర్మించి, నటించిన చిత్రం ‘నాట్యం’.. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై ఈ సినిమా రూపొందిచారు. అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా 2021 చిత్రోత్సవానికి ఈ సినిమా ఎంపికైనట్లు ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్‌ఫర్మెషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌’ తెలిపింది. అలాగే ఇండియన్‌ పనోరమా సెక్షన్‌లో ‘నాట్యం’ సినిమా స్క్రీనింగ్‌‌కి కూడా ఎంపిక చేయడం విశేషం.

అయితే నవంబర్‌ 20-28 వరకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో సంధ్యారాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మొద‌లుపెట్టగానే చాలామంది ఎందుకు మీరు సినిమా రంగం వైపు వ‌చ్చారన్నారు. నేను ఎన్ని స‌మాధానాలు చెప్పినా వారు సంతృప్తి చెంద‌లేదు. అయితే ఈ రోజు నాట్యం సినిమా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా‌కు సెల‌క్ట్ అయ్యాక వారందరికి స‌మాధానం దొరికింది. ఈ సినిమాతో మ‌రోసారి మన తెలుగు సాంప్రదాయ నృత్య విలువని, ప్రాధాన్యతను తెలియజేసినందుకు గర్వంగా ఉంది. దీంతో సౌత్ ఇండియ‌న్ డ్యాన్స్ మ‌రింత మందికి చేరువ‌వుతుంది. నాట్యం మూవీ టీమ్ అంద‌రికీ ధ‌న్యవాదాలు’ అని అన్నారు.

Next Story

Most Viewed