ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం రూ. 815 కోట్లు!

by Harish |
ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం రూ. 815 కోట్లు!
X

దిశ, ముంబయి: బంగారు ఆభరణాలపై రుణాలు అందించే ముత్తూట్ ఫైనాన్స్ 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి నికర లాభం 59 శాతం వృద్ధితో రూ. 815 కోట్లుగా నమోదు చేసింది. మార్చి త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 28 శాతం పెరిగి రూ. 2,351 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇది రూ. 1,832 కోట్లని కంపెనీ తెలిపింది. స్వతంత్ర రుణ ఆస్తులు మార్చి చివరి నాటికి రూ. 46,611 కోట్లు ఉందని, అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి రూ. 34,246 కోట్లని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం 51 శాతం పెరిగి రూ. 3,169 కోట్లకు చేరినట్టు ముత్తూట్ ఫైనాన్స్ ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ చెప్పారు. ‘కరోనా వ్యాప్తి తర్వాత ఏప్రిల్ 20 నుంచి సంస్థకు చెందిన ఎక్కువ శాఖలను పునఃప్రారంభించాం. పంపిణీ, సేకరణ సహా అన్నీ విభాగాలు సాధారణంగా పనిచేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నుంచి బయటపడి ఆర్థిక కార్యకలాపాలు పెరిగిన తర్వాత మరింత మెరుగ్గా పరిస్థితులు ఉంటాయని’ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story