- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొన్ని రోజులు క్రికెట్‌కి దూరం: ముస్తఫిజుర్
దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ కొన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. బయో బబుల్‌లో ఉండటం వల్ల చాలా చిరాకుగా ఉంటుందని, మానసికంగా కుంగిపోతున్నట్లు ముస్తఫిజుర్ అంటున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ముస్తఫిజుర్, తర్వాత బంగ్లాదేశ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి బయోబబుల్‌లో ఉంటున్నాడు. అంతకు ముందు న్యూజీలాండ్ పర్యటనలో కూడా బయోబబుల్‌లో ఉండి నేరుగా ఇండియాకు వచ్చాడు.
ఇలా వరుసగా బబుల్‌లో ఉండి చిరాకు వేస్తున్నదని.. అందుకే కొన్నాళ్లు క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చి కుటుంబంతోగడపాలని అనుకుంటున్నట్లు ముస్తఫిజుర్ వెల్లడించాడు. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత రాజస్థాన్ యాజమాన్యం మమ్మల్ని క్షేమంగా బంగ్లాదేశ్ పంపినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. టోర్నీ జరిగే సమయంలో ఆటగాళ్లకు కరోనా సోకినప్పుడు ఒకే గదిలో ఐదారు రోజులు గడపాల్సి వచ్చింది. అప్పుడు నరకంలా అనిపించిందని ముస్తఫిజుర్ అన్నాడు.