- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాళ్లు మమత జాగీర్ కాదు: ఓవైసీ
by Shamantha N |
X
హైదరాబాద్: ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ జాగీరు కాదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తనను డబ్బులతో కొనగలిగే వ్యక్తి ఇప్పటివరకు పుట్టలేదని తెలిపారు. పశ్చిమబెంగాల్ ఓటర్లను విడదీయడం కోసం బీజేపీ రూ.కోట్లు వెచ్చించి హైదరాబాద్ పార్టీని తీసుకు వస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా మమతా బెనర్జీ ఆరోపణలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సీఎం మమతా ఆరోపణలు నిరాధారం అని, ఒత్తిడిలో ఉన్నారని అన్నారు.
తృణమూల్ నేతలు బీజేపీలోకి వెళ్తున్నారని, మొదట సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని పశ్చిమబెంగాల్ సీఎంకు అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. ఎంఐఎం పార్టీకి ఓటేసిన బీహార్ ప్రజలను మమతా బెనర్జీ అవమానించారని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి ఏఐఎంఐఎం పార్టీ సీమాంచల్ ప్రాంతంలో ఐదు శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్న విషయం విదితమే.
Advertisement
Next Story