ఆ శంకుస్థాపనకు యోగిని ఆహ్వానిస్తాం

by Shamantha N |
ఆ శంకుస్థాపనకు యోగిని ఆహ్వానిస్తాం
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల్లో నిర్మించే లైబ్రరీ, హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, ప్రచురణాలయ నిర్మాణాల శంకుస్థాపనకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కచ్చితంగా ఆహ్వానిస్తామని అయోధ్య మసీదు నిర్మాణాన్ని పర్యవేక్షించే ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ తెలిపింది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మసీదు నిర్మాణానికి శంకుస్థాపన ప్రక్రియ ఉండదని, కాబట్టి సీఎంను ఆహ్వానించే అవకాశమే లేదని ఫౌండేషన్ కార్యదర్శి అథర్ హుస్సేన్ అన్నారు.

అయితే, అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదుతోపాటు తాము కమ్యూనిటీ కిచెన్, హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, పబ్లిషింగ్ హౌజ్‌లను నిర్మిస్తున్నారని చెప్పారు. ఈ పబ్లిక్ ఫెసిలిటీల శంకుస్థాపనకు తాము సీఎంను ఆహ్వానిస్తామని, ఆయన ప్రజలందరికీ ముఖ్యమంత్రి అని అన్నారు. మసీదు శంకుస్థాపనకు తాను వెళ్లబోరని, ఎవరూ ఆహ్వానించవద్దని కరాఖండిగా యోగి పేర్కొన్న మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. బాబ్రీ మసీదు కేసులో అయోధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed