- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు రక్తంతో లేఖ.. ఆ పోస్టుల్లో మా వాళ్లకు అవకాశం కల్పించాలని..!
దిశ, హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమాల్లో పాల్గొన్న ముస్లిం ఉద్యోగ సంఘ నాయకులకు ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తన రక్తంతో ఆదివారం లేఖ రాశారు. తెలంగాణా సాధన కోసం సకల జనులసమ్మె, ధర్నా, రాస్తారోకో, రిలే నిరాహార దీక్షలు, జంతర్ మంతర్ వద్ద దీక్షల్లో పాల్గొనడంతో పాటు శ్రీ క్రిష్ణ కమిటీకి వినతి పత్రాలు అందజేసిన వారిలో చాలా మంది ముస్లిం నాయకులు కూడా ఉన్నారన్నారు.
ముస్లిం ఉద్యోగ సంఘ నాయకులకు రాష్ర్త స్థాయి నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌కు లేఖ రాసినట్లు ముజాహిద్ హుస్సేన్ చెప్పారు.