గంజాయి మత్తులో వివాదం.. స్నేహితుడి హత్య.. అసలేం జరిగింది..?

by Sumithra |
గంజాయి మత్తులో వివాదం.. స్నేహితుడి హత్య.. అసలేం జరిగింది..?
X

దిశ, చార్మినార్ : గంజాయి సేవించాక జరిగిన వివాదంలో స్నేహితుడిని కత్తెరతో పొడిచి అతికిరాతకంగా హతమార్చిన ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. స్నేహితులే కాల యములై చార్మినార్, కాలాపత్తర్, ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలలో వరుసగా జరుగుతున్న హత్యలతో పాతబస్తీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఛత్రినాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … మీర్ పేట్ కు చెందిన అయ్యవారి ఉమాకాంత్ (33) సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్న సమయంలో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీయడంతో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఉమాకాంత్ పై ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఈ పిట్టి కేసులతో పాటు, 2017 లో మెదక్ కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడు.

ఇదిలా ఉండగా.. ఉమాకాంత్ కు అరుంధతి కాలనీ బ్రిడ్జి రాజీవ్ గాంధీనగర్ కు చెందిన రవి స్నేహితుడు. వీరిద్దరూ తరచు మద్యం, గంజాయి సేవించేవారు. అద్దెకు నివసించే రవి గదిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని ఇంటి యజమాని నర్సింహులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 100 కు డయల్ చేసి ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, ఛత్రినాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శవ పంచనామ నిర్వహించి మృత దేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

హత్య జరిగిన తీరుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమాకాంత్ మీర్‌పేట్ నుంచి అరుంధతి కాలనీ బ్రిడ్జి ప్రాంతంలో అద్దెకు నివసించే రవి ఇంటికి శనివారం అర్థరాత్రి వచ్చాడు. ఇద్దరు కలిసి గంజాయి, మద్యం సేవించారు. గంజాయి మత్తులో చేరుకున్నాక వారి మధ్యలో జరిగిన వివాదంలో రవి ఆగ్రహంతో ఊగిపోయి ఉమాకాంత్ కడుపులో కత్తెరతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమాకాంత్ హత్య రవి గదిలో జరగడం.. రవి పరారీలో ఉండడం పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా స్వయంగా రవి తన ఇంటి యజమానికి ఫోన్ చేసి ఇంట్లో ఒకరిని హత్య చేసినట్లు చెప్పడం.. ఇంటి యజమాని డయల్ 100 కి ఫోన్ చేయడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. రవి కూడా హ్యాత్యాయత్నం కేసులో నిందితుడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed