- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాజీ రంజీ క్రికెటర్ హత్య

దిశ, స్పోర్ట్స్: కేరళ రంజీ మాజీ క్రికెటర్ కే.జయమోహన్ తంపి కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. తిరువునంతపురంలోని ఆయన నివాసం నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు వచ్చి పరిశీలించగా కుళ్లిపోయి ఉన్న జయమోహన్ మృతదేహం కనిపించింది. అతని కొడుకు అశ్విన్‌ను అదుపులోనికి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తండ్రీకొడుకులు ఇద్దరూ ఇంట్లోనే కూర్చొని మద్యం తాగే అలవాటు ఉంది. గత శనివారం తాగిన తర్వాత మరింత లిక్కర్ కోసం జయమోహన్ డెబిట్ కార్డ్ నుంచి మరిన్ని డబ్బులు విత్‌డ్రా చేస్తానని అశ్విన్ చెప్పాడు. దీనికి జయమోహన్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో అశ్విన్ తండ్రి తలను నేలకేసి కొట్టాడు. అనంతరం తండ్రి మృతిచెందే వరకూ పక్కనే కూర్చుని మద్యం తాగి పడుకున్నాడని పోలీసులు తెలిపారు. జయమోహన్ కేరళ జట్టు తరపున 1979-82 మధ్య రంజీ మ్యాచ్‌లు ఆడాడు.