- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, కంటోన్మెంట్: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి, కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ముప్పిడి ముధుకర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం నడుస్తోంది. రేవంత్ రెడ్డితో మధుకర్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఎన్నికలలో పోటీ చేయడంతో రేవంత్ రెడ్డి గెలుపు కోసం ముప్పిడి మధుకర్ అహర్నిశలు శ్రమించారు.టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన మంత్రి మల్లారెడ్డి స్వయాన అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి తనకు సపోర్ట్ చేయాలని కోరినా, లోకల్ ఫీలింగ్ తెచ్చినా ముప్పిడి మధుకర్ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
కంటోన్మెంట్‌లోని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డికి లోకల్ ఫిలింగ్‌తో బహిరంగంగానే సపోర్ట్ చేసినా.. మధుకర్ మాత్రం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు. రేవంత్ రెడ్డికి పీసీపీ పీఠం దక్కడంతో మధుకర్ కూడా టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని యెచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని తన సన్నిహితులు, టీడీపీ పార్టీ శ్రేణులతో ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే రాబోయే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో తన సత్తా చాటడంతో పాటు రిజర్వుడ్ స్థానమైన కంటోన్మెంట్ కు ఎమ్మెల్యే రేసులో ఉండోచ్చని ముప్పిడి అనుచరులు చెబుతున్నారు.