- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : 24 గంటల్లోనే తిరిగి సొంత గూటికి మున్సిపల్ కౌన్సిలర్స్
దిశ, సిద్దిపేట : మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల సమక్షంలో దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్స్ తిరిగి సొంత గూటికి చేరారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్స్‌లలో ఇద్దరు దివిటి కనకయ్య ఏడవ వార్డు, డి.బాలకృష్ణ ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్స్ బుధవారం మళ్లీ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ప్రగతి ప్రభుత్వానికే జై అంటూ.. అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటామంటూ నినాదాలు చేశారు. 24 గంటలు గడవక ముందే సొంత గూటికి చేరడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు చక్రం తిప్పారని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ రాకతో టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. అంతేకాకుండా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఏ ఒక్కరిని వదులుకోవడానికి అధిష్టానం సిద్ధంగా లేదు. అందునా దుబ్బాక బై ఎలక్షన్స్ లో అధికార పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న అధిష్టానం దుబ్బాకలో పట్టు కోల్పోకుండా ఉండటానికి సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చోటా నాయకుల నుండి బడా నాయకుల వరకు నయానో భయానో ఎవరూ పార్టీ మారకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ క్రమంలో దుబ్బాక నుండి ముగ్గురు కౌన్సిలర్లు పార్టీ మారడం అధికార పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. అందుకే మంత్రి హరీష్ రావు హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. హరీష్ సంప్రదింపులతో కన్విన్స్ అయిన ఇద్దరు కౌన్సిలర్లు 24 గంటలు తిరగకుండానే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాగా మూడో నేత కూడా వచ్చే అవకాశాలున్నట్టు గులాబీ వర్గాల సమాచారం.