- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అభ్యంతరాలను ఎలా వ్యక్తం చేయాలి'
దిశ, మహబూబ్ నగర్: పాలమూరు పురపాలక కౌన్సిల్ 2020-21 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి బుధవారం సమావేశమవుతోంది. ఈ ఏడాది జనవరి 27న కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత ఫిబ్రవరి 10న పరిచయ కార్యక్రమం పేరిట తొలి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మార్చి తొలివారంలో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు పురపాలక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాలు నుంచే చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, కమిషనర్ సురేందర్ లు మిగతా కౌన్సిలర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్‌రావు సైతం పాల్గొంటున్నట్లు కమిషనర్ తెలిపారు. కౌన్సిలర్లంతా తమ ఇళ్ల నుంచే బడ్జెట్‌పై అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని సూచించారు. ఈ ఏడాదికి రూ.6,786.49 లక్షలతో అంచనా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మొత్తంగా ఖర్చు రూ.6,748.22 లక్షలు నిర్ణయిస్తూ 2021 మార్చి నాటికి రూ.38.27 లక్షల మిగులు చూపుతున్నారు. అయితే టెలికాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్ ప్రవేశ పెట్టడాన్ని బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉన్నందున ఓ ఫంక్షన్ హాల్‌లో భౌతిక దూరం పాటిస్తూ బడ్జెట్ సమావేశం నిర్వహిస్తే బాగుండేదంటున్నారు. ఇలా టెలికాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్ సమావేశం నిర్వహించడం వల్ల తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను ఎలా వ్యక్తం చేయగలమని ప్రశ్నిస్తున్నారు.