ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్

by Shyam |
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ :
ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కీసర తహశీల్దార్ నాగరాజు ఉదంతం మరువక ముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరో పెద్ద అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. పోలీసుల వివరాల ప్రకారం…. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ లక్షా 65 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. హైదరాబాద్ లో క్లోరినేషన్ మెటీరియల్ ను అలీ అహ్మద్ అనే వ్యాపారి సరఫరా చేస్తాడు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి కూడా క్లోరినేషన్ కెమికల్‌ను ఆయనే సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అతని టెండర్ పూర్తి కావడంతో దాని పునరుద్ధరణ కోసం మున్సిపల్ కమిషనర్‌ను అలీ కలిశారు. అయితే రూ.15లక్షల టెండర్‌ను నామినేషన్ పద్దతిలో కలెక్టర్‌తో మాట్లాడి వచ్చేలా చేస్తాననీ, అందుకు దరఖాస్తు చేయాలని కమిషనర్ చెప్పారు. చెప్పిన విధంగా దరఖాస్తు చేసుకున్న తరువాత అందులో 10శాతం అంటే లక్షా 65వేలు తనకు ఇవ్వాలని బాధితున్ని కమిషనర్ కోరాడు. ఏసీబీ అధికారులను బాధితుడు సంప్రదించాడు. దీంతో ప్రణాళిక ప్రకారం కమిషనర్ సురేందర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో కమిషనర్‌ను శుక్రవారం ప్రవేశ పెటనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed