- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మున్సిపల్ చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న ఆ సంఘం నాయకులు
దిశ, తొర్రూర్ : ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి లవిశెట్టి ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం గాంధీ సెంటర్లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. తొర్రూర్ లోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో భోజనం సరిగ్గా లేదని దానిని తనిఖీ చేయాలని సంఘం నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను ఫోన్‌లో కోరగా మధ్యాహ్నం సమయంలో వెళ్దామని చెప్పారని అన్నారు.
కమిషనర్‌ను తీసుకుని వెళ్దామని మున్సిపాలిటీ ఆఫీస్ కి వెళ్లగా ఆ సమయంలో చైర్మన్ రామచంద్రయ్య అందుబాటులో ఉండగా వారిని కూడా రమ్మని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులను మీరు ఏ సంఘం అయితే ఏంది నేను రాను పో బయటికెళ్ళు, ఎస్ఎఫ్ఐ అయితే ఏంది ఇంకా ఏదైతే నాకేందిపో బయటికి వెళ్ళు అని దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. విద్యార్థి సంఘం నాయకులకు చైర్మన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అమీర్, నాయకులు వెంకటేష్, యోగి రాజు, కుమార్, నాగరాజు, సోహెల్ ,యాకన్న తదితరులు పాల్గొన్నారు.