Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో భారీగా ఎగసిపడుతోన్న మంటలు

by Shiva |
Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో భారీగా ఎగసిపడుతోన్న మంటలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: షార్ట్ సర్యూట్ కారణంగా ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన నంద్యాల జిల్లా (Nandyal District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని శ్రీకరి ఆసుపత్రి (Srikari Hospital)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదట మంటలు ఎగసిపడ్డాయి. అయితే, సిబ్బంది సకాలంలో ఎవరూ చూడకపోవడంతో క్రమంగా నిప్పు అన్ని ఫ్లోర్లకు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది, ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా.. వారు ఘటనా స్థలానికి చేరకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో రోగులు ఉండటంతో సిబ్బంది అద్దాలు ధ్వంసం చేసి రోగులను కాపాడి సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed