- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
‘మున్సిపోల్’ టెన్షన్.. ప్రారంభమైన కౌంటింగ్
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపుకోసం 70 కౌంటింగ్ కేంద్రాలు, కార్పొరేషన్లలో 2,204, మున్సిపాలిటీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు 20వేల మంది పోలీసులతో అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవాళ 71 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్‌పై హైకోర్టు స్టే ఉన్నందున దానిని పెండింగ్‌లో పెట్టారు. ఇప్పటికే పులివెందుల, మాచర్ల, పుంగనూరు, పిడుగురాళ్లకు చెందిన నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవమవ్వగా అధికార వైసీపీ ఖాతాలో చేరాయి. అదేవిధంగా చిత్తూరు కార్పొరేషన్‌లోని 50డివిజన్లలో 37 ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతోంది.