- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Cool PPE Kit: కూల్ పీపీఈ కిట్.. పూణే కుర్రాడి ప్రతిభ
దిశ, ఫీచర్స్ : కరోనా బాధితులకు ట్రీట్‌మెంట్ అందించే డాక్టర్లు, నర్సులు ఇతర వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు, మాస్క్, గ్లౌజులు ధరించడం అత్యంత ఆవశ్యకం. దాదాపు ఏడాదిన్నర నుంచి వైద్యులు కొవిడ్ చికిత్సలో వీటిని ధరించడం విధిలో భాగమైంది. అయితే మాస్క్ వల్ల ఎంతోమంది వైద్యులకు ముఖంపై చారలు రాగా, గ్లౌజుల వల్ల చేతుల్లోని రేఖలు కోల్పోయారు. ఇక పీపీఈ కిట్ వల్ల వేసవి తాపంతో చమటలు పోస్తున్నా, తమ డ్యూటీని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో వైద్య బృంద కష్టనష్టాలను గమనించిన ముంబై విద్యార్థి ‘కూల్ వెంటిలేషన్’ సిస్టమ్‌ను అభివృద్ధి చేశాడు.
వైద్య సిబ్బంది సాధారణంగా పీపీఈ కిట్లలో గంటలుగంటలు పని చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఇంజనీరింగ్ రెండో సంవత్సర విద్యార్థి నిహాల్ ‘కూల్ వెంటిలేషన్ బెల్ట్’ రూపొందించాడు. ఈ బెల్ట్ చుట్టుపక్కల గాలిని తీసుకుని, ఆ గాలిని ఫిల్టర్ చేసి పీపీఈ సూట్‌లోకి నెట్టివేస్తుంది. అందువల్ల, ఇది ధరించిన వ్యక్తి వేడి నుంచి ఉపశమనం పొందడంతో పాటు, ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. 6-8 గంటల బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ పీపీఈ కిట్‌ను టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్, డిజైన్ లాబొరేటరీ సంయుక్తంగా COVID-19- సంబంధిత పరికరాల డిజైన్ చాలెంజ్‌లో భాగంగా అభివృద్ధి చేశాడు.
మా అమ్మ డాక్టర్ పూనమ్ కౌర్ ఆదర్ష్, ప్రస్తుతం పూణేలో జనరల్ ఫిజిషియన్‌గా సేవలందిస్తుంది. ప్రస్తుతం కొవిడ్ చికిత్సల్లో భాగంగా పీపీఈ కిట్ల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను నాకు వివరిస్తుండేది. తన బాధను అర్థం చేసుకున్న నేను, అమ్మ లాంటి ఎంతోమంది వైద్యులకు సాయంగా ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ క్రమంలోనే కూల్ వెంటిలేషన్ బెల్ట్ తయారీ ఆలోచన వచ్చింది. నా ఆలోచన, ఆచరణగా మారడానికి రిత్విక్ మరాతే, సాయిలీ భవసాలు సహాయం చేశారు. ప్రస్తుతం ఈ పీపీఈ కిట్లను పుణేలోని రెండు, మూడు ఆస్పత్రుల్లో ఉపయోగిస్తుండటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.