- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుసగా 20 చైన్ స్నాచింగ్‌లు.. ఒకరి అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: వరుసగా 20 చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన ఓ నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న ముంబైలోని వడాలలో తన కొడుకు కోసం పాఠశాల ముందు ఓ మహిళ ఎదురుచూస్తున్నది. ఆ సమయంలో ఆ మహిళ వద్దకు ఓ వ్యక్తి బైక్ పై వచ్చి ఆమె మెడలో ఉన్న రూ.30 వేలు విలువ చేసే బంగారు గొలుసును లాక్కెళ్లాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు షోయబ్ అబ్దుల్ మతీన్ షేక్(23) గా గుర్తించారు. నిందితుడికి బాల్యం నుంచి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నాడని, అతనిపై ఇప్పటికే ముంబై, థానే, నవీ ముంబై వ్యాప్తంగా మొత్తం 20 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని, వశి పోలీస్ స్టేషన్‌లో నమోదైన స్నాచింగ్ కేసుకు సంబంధించి మూడు నెలల క్రితం జైలుకు పోయొచ్చాడని పోలీసులు తెలిపారు. దొంగతనాల నుండి వచ్చే డబ్బును మాదకద్రవ్యాల కోసం, విలాసాలకు ఖర్చు చేస్తాడని వారు తెలిపారు.
Tags : serial chain snatcher, bail, Mumbai police, habitual, 20 cases