- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తడబడి నిలబడిన ముంబై.. RR టార్గెట్ 194
దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆట ప్రారంభ దశలోనే తనదైన దూకుడు కనబరిచింది. ఓపెనర్స్ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ రన్ రేట్ పెంచుతున్న సమయంలో 49 పరుగుల వద్ద (4.5) ఓవర్‌లో డికాక్ ఔట్ అయ్యాడు. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 23 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తోడ్పాటుతో తనదైన శైలితో పరుగుల వరద పారించాడు. ఫోర్లు సిక్సులతో చెలరేగాడు.
ఒకానొక సమయంలో భారీ స్కోరు చేస్తుందనుకున్న ముంబైను శ్రేయాస్ గోపాల్ గట్టి దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి ముంబై ఆధిపత్యానికి గండి కొట్టాడు. డికాక్ తరహా భారీ షాట్‌కు యత్నించిన రోహిత్ 88 పరుగుల వద్ద శ్రేయాస్ బౌలింగ్‌లో తెవాటియా క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే రోహిత్ 2ఫోర్లు, 3 సిక్సులతో 35 పరుగులు చేశాడు. అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్ కూడా అదే బౌలింగ్‌లో సమ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు.
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన క్రునాల్ పాండ్యా 117 పరుగుల వద్ద అర్చర్ బౌలింగ్‌లో శ్రేయాస్‌కు క్యాచ్ వెనుదిరగడంతో ముంబై కష్టాల్లోకి వెళ్లింది. రెండో స్ట్రాటజిక్ సమయానికి ముంబై నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోగా, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి హార్దిక్ పాండ్యా పరుగుల వరద పారించాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే బౌండరీలకు మలుస్తూ రాజస్థాన్ బౌలర్ల మీద రివెంజ్ తీసుకున్నారు.
19వ ఓవర్ ప్రారంభం సమయానికి వీరిద్దరి భాగస్వామ్యం 58 (31) ఉంది. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ 79(47)(నాట్‌ఔట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అందులో 11ఫోర్లు, 2సిక్సులు ఉన్నాయి. ఇక పాండ్యా (నాట్ ఔట్) కూడా తనదైన శైలిలో చెలరేగి 30(19) రెండు ఫోర్లు, ఒక సిక్సు బాదాడు. దాంతో పరిమిత 20 ఓవర్ల మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 194 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు ముందు ఉంచింది.
Mumbai Indians Innings: క్వింటాన్ డీకాక్ (wk)c జోస్ బట్లర్ b కార్తీక్ త్యాగి 23(15),
రోహిత్ శర్మ (c)c రాహుల్ తివాతెయా b శ్రేయస్ గోపాల్ 35(23), సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 79(47) ఇషాన్ కిషన్ c శాంసన్ b శ్రేయస్ గోపాల్ 0(1), కృనాల్ పాండ్యా c శ్రేయస్ గోపాల్ b జోఫ్రా ఆర్చర్ 12(17), హార్దిక్ పాండ్యా 30(19) ఎక్స్‌ట్రాలు 13, మొత్తం స్కోరు 193/4
వికెట్ల పతనం: 49-1 (క్వింటాన్ డీకాక్, 4.5), 88-2 (రోహిత్ శర్మ , 9.1), 88-3 (ఇషాన్ కిషన్, 9.2), 117-4 (కృనాల్ పాండ్యా, 13.6).
బౌలింగ్: అంకిత్ రాజ్‌పుత్ 3-0-42-0, శ్రేయస్ గోపాల్ 4-0-28-2, జోఫ్రా ఆర్చర్ 4-0-34-1, కార్తీక్ త్యాగి 4-0-36-1, టామ్ కుర్రాన్ 3-0-33-0, రాహుల్ తివాతెయా 2-0-13-0.