- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవీకే గ్రూప్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు !
దిశ, వెబ్‌డెస్క్: జీవీకే గ్రూప్ ఛైర్మన్, అతని కుమారుడిపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముంబై ఎయిర్‌పోర్ట్ స్కామ్‌కు సంబంధించి మంగళవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ. 705 కోట్ల అవినీతి ఆరోపణల్లో జీవీకే గ్రూప్, ప్రమోటర్లు, ముంబై ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికారులు, ఇతర అనుబంధ సంస్థలపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3 కింద కేసు దాఖలు చేసినట్టు ఈడీ అధికారులు చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ ప్రశ్నిస్తామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. త్వరలో కంపెనీ ఖాతాలను పరిశీలించడం, నిధుల బదిలీని ఈడీ ప్రారంభించనుంది. అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా ఆస్తులను అటాచ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, ఈడీ నుంచి తమకెలాండి నోటీసులు రాలేదని జీవీకే ప్రతినిధులు వెల్లడించారు. సీబీఐ కేసు విషయం తెలిసి ఆశ్చర్యపోయాయని ముంబై ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి గతవారం ఓ ప్రకటనలో చెప్పారు. విచారణకు అన్ని రకాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు.