జియో మరో భారీ డీల్!

by  |
జియో మరో భారీ డీల్!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లోని సావరీన్ వెల్త్ ఫండ్స్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌తో చర్చలు జరుపుతున్నాయి. అబుదాబికి చెందిన ముబదలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీతో చర్చలు జరుగుతున్నట్లగా గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ చర్చలు దాదాపు చివరి దశలో ఉన్నట్లుగా సమాచారం. రిలయన్స్ డిజిటల్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 7 వేల కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. ముబదాలా పెట్టుబడిపై ఈ వారంలోగా ప్రకటన వచ్చే అవకాశమున్నట్టు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే, సౌదీకి చెందిన అబుదాబికి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ అయినటువంటి పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో కూడా రిలయన్స్ జియోలో పెట్టుబడుల కోసం చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది. అయితే, చర్చలు జరుపుతున్న అన్ని కంపెనీలతో ఒప్పందం ఖరారు కావని, మధ్యలో ఆగిపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇవి ఎంత పెట్టుబడి పెడతాయనే దానిపై స్పష్టత రానప్పటికీ.. రెండు సంస్థలూ కలిపి సుమారు రూ. 15 వేల కోట్లను పెట్టుబడులను పెట్టే అవకాశాలున్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా అమ్మకాల్లో ఇదే చివరిది అవ్వొచ్చని కూడా చెబుతున్నారు.

జియోలో వాటా అమ్మకం ద్వారా కనీసం రూ. 90 వేల కోట్లను సమీకరించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యంగా పెట్టుకుకుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి సంస్థను రుణరహిత కంపెనీగా మార్చాలనేది అంబానీ లక్ష్యం. ఇప్పటివరకూ వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా రూ. 78,562 కోట్లను సాధించుకుంది. వీటిలో…ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కొనుగోలుతో రూ. 43,574 కోట్లు, అమెరికా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజ కంపెనీ సిల్వర్ లేట్ పార్ట్‌నర్స్ 1 శాతం వాటాతో రూ. 5,655 కోట్లు, విస్టా ఈక్విటీ 2.3 శాతం కొనుగోలుతో రూ. 11,367 కోట్లను, జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్ 1.34 శాతం వాటాతో రూ. 6,598.38 కోట్ల పెట్టుబడులను రాబట్టింది.


Next Story

Most Viewed