- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేజీఎఫ్ 2’ టీమ్ ఏం చెప్పబోతుంది?

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఎండింగ్‌కు చేరుకున్న సందర్భంగా.. సినిమా కోసం ఎప్పటి నుంచో ఆతృతతో వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు వండర్‌ఫుల్ గిఫ్ట్ ఇస్తామని తెలిపారు. ఈ మోస్ట్ అవెయిటెడ్ న్యూస్‌ను డిసెంబర్ 21 ఉ.10.08 నిమిషాలకు కేజీఎఫ్ టీమ్ రివీల్ చేస్తుందని వెల్లడించారు. మా ప్రయాణంతో ఓపికగా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఈ సర్‌ప్రైజ్‌కు సిద్ధంగా ఉండాలని కోరారు.
Here's the much anticipated news of the year! The wait is over! This is for all our crazy fans out there. #KGFChapter2@VKiragandur @TheNameIsYash @prashanth_neel @hombalefilms @duttsanjay @SrinidhiShetty7 @TandonRaveena @bhuvangowda84 @BasrurRavi @Karthik1423 pic.twitter.com/Z7EdeXkzjG
— Prashanth Neel (@prashanth_neel) December 19, 2020
ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హీరో యశ్, విలన్ సంజయ్ దత్ మధ్య జరుగుతున్న క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ కంప్లీట్ కాబోతుండగా.. కేజీఎఫ్ టీమ్ ఇచ్చే బహుమతి ఏమై ఉంటుందన్న ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఉంటుందేమో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. జనవరి 8న మూవీ టీజర్ విడుదల కాబోతుంది. కాగా హోంబలె ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రకాశ్ రాజ్, రవీనా టాండన్, రావు రమేశ్ ప్రధానపాత్రల్లో నటించబోతున్నారు.