స్టీల్ ధరలను నియంత్రించాలని కోరిన ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులు

by Harish |
స్టీల్ ధరలను నియంత్రించాలని కోరిన ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా భారీగా పెరుగుతున్న ఉక్కు ధరలను నియంత్రించాలని ఎంఎస్ఎంఈ విభాగంలో ఇంజనీరింగ్ ఎగుమతిదారులు ప్రధానమంత్రిని కోరారు. పరిశ్రమలో ఉక్కు మిశ్రమాలు, ఇతర ఇన్‌పుట్ పరికరాలు సరసమైన ధరలకు అవసరమని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత సంస్థలు ఉత్పత్తుల ఎగుమతుల పోటీని కొనసాగించగలవని వారు వివరించారు. ‘ఇతర దేశాలు, చైనా సహా తమ ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచ మార్కెట్లలో పోటీని పెంచేందుకు తక్కువ ధరలకు స్టీల్, ఇతర ఇన్‌పుట్ పరికరాలను అందించి తయారీ పరిశ్రమలకు మద్దతు ఇస్తున్నాయని’ హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ పి రాల్హాన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు.

ఎగుమతుల విలువ ఆధారిత విభాగంలో భారత్ తన మార్కెట్‌ను కోల్పోతోందని ఆయన తెలిపారు. పూర్తయిన ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో గణనీయమైన క్షీణత కనిపిస్తోందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు తక్కువ ధరలకే ఉక్కును అందించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో వివరించారు. ధరలు అదుపులోకి రాకపోతే పెద్ద సంఖ్యలో తయారీదారులు వ్యాపారాలకు దూరమవుతాయని, దీనివల్ల కర్మాగారాలు మూసేయడం, ఉపాధి నష్టం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story