రాయుడ్ని ఎంపిక చేయకపోవడంపై బాధపడ్డాను: ఎమ్మెస్కే

by Shyam |
రాయుడ్ని ఎంపిక చేయకపోవడంపై బాధపడ్డాను: ఎమ్మెస్కే
X

త వరల్డ్ కప్‌కు అంబటి రాయుడ్ని ఎంపిక చేయకపోవడంపై బాధపడ్డానని టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, 2016 జింబాబ్వే పర్యటన తరువాత రాయుడ్ని టెస్టుల్లోకి ఎంపిక చేసే విషయంపై సెలక్షన్ కమిటీ తీవ్రంగా ఆలోచించిదని ఎమ్మెస్కే వెల్లడించారు.

ఆ సమయంలో రాయుడ్ని సుదీర్ఘ ఫార్మాట్ (టెస్టు క్రికెట్)పై దృష్టిపెట్టాలని సూచించానని కూడా చెప్పానన్నారు. వరల్డ్ కప్ ఎంపిక అంశం చాలా సున్నితమైనదని స్పష్టంగా చెప్పగలనని ఎమ్మెస్కే తెలిపారు. రాయుడ్ని ఎంపిక చేయలేదని విమర్శించేవారు రాయుడ్ని ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే వన్డే జట్టులోకి తీసుకున్నామన్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. జింబాబ్వే పర్యటన తరువాత రాయుడితో చర్చించిన సమయంలో రాయుడి శారీరక దారుఢ్యంపై మాట్లాడానన్నారు.

నెల రోజుల పాటు రాయుడు శారీరక దారుఢ్యంపై ఎన్సీఏలో దృష్టి సారించామని గుర్తుచేసుకున్నార. అయితే వరల్డ్ కప్ లో ఎంపిక చేయడంపై తాను కూడా బాధపడ్డానని ఆయన చెప్పారు. కాగా, న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేయడమే ఎమ్మెస్కే చివరి ఎంపిక. సౌతాఫ్రికా సిరీస్ కు కొత్త సెలక్టర్లు భారత జట్టును ఎంపిక చేయనున్నారని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఎమ్మెస్కే ప్రసాద్ తో పాటు గగన్ ఖోడా కూడా సెలక్షన్ కమిటీకి దూరం కానున్నాడు.

Advertisement

Next Story

Most Viewed