- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగుళూరులో ధోనీ క్రికెట్ అకాడమీ
దిశ, స్పోర్ట్స్: ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ బెంగళూరులో ప్రారంభమైంది. బెంగళూరులోని బిదరహల్లిలో ఏర్పాటు చేసిన ధోనీ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన వెంటనే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. గేమ్ ప్లే, ఆర్కా స్పోర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో నవంబర్ 7 నుంచి క్రీడాకారుల శిక్షణ ప్రారంభించనున్నారు. బెంగళూరు అకాడమీలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన సందర్భంగా ఎంఎస్ ధోని దుబాయ్ నుంచి క్రికెటర్లకు ప్రత్యేక సందేశం పంపించాడు.
‘బెంగళూరులో క్రికెట్ అకాడమీ ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. యువ క్రికెటర్లకు 360 డిగ్రీల్లో శిక్షణ ఇప్పించడమే కాకుండా వారిలో టెక్నిక్‌ను సరికొత్త టెక్నాలజీతో మెరుగు పరుస్తాము. అకాడమీలో చేరే ప్రతీ క్రికెటర్ నైపుణ్యాలను పెంచడమే మా ప్రధాన ఉద్దేశం. ఎంతో మంది సుశిక్షితులైన కోచింగ్ స్టాఫ్ అకాడమీలో అందుబాటులో ఉంటుంది. వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అకాడమీలో భాగస్వాములు అవ్వండి’ అని ధోనీ వీడియో సందేశంలో చెప్పాడు. ఎంఎస్ ధోని ఈ ఏడాది మొదట్లో అహ్మదాబాద్‌లో కూడా అకాడమీని ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా పలు నగరాలతో పాటు ప్రధాన పట్టణాల్లో కూడా క్రికెట్ అకాడమీలో తెరిచే ఉద్దేశంలో ధోనీ అండ్ టీమ్ ఉన్నది.