- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లు తలచుకుంటే ధోనీ ఆడతాడు: ఆకాశ్ చోప్రా
దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏడాది నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్‌లో సత్తాచాటి తిరిగి జట్టులోకి రావాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే, టీం ఇండియా యాజమాన్యం తలచుకుంటే ధోనీ జట్టులోకి రావడం పెద్ద కష్టమేం కాదని, ఐపీఎల్ ప్రదర్శనతో సంబంధం లేకుండానే ధోనీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఏడాది నుంచి ధోని క్రికెట్ ఆడలేదని అతని ఫామ్‌పై అనుమానాలు వ్యక్తం చేయొద్దని చోప్రా అన్నాడు. ధోని, ఏబీ డివిలియర్స్ ఇద్దరూ తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చోప్రా చెప్పాడు. 2018లో ఏబీ డివిలియర్స్ అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. కానీ అతడు ఇప్పటికీ మంచి ఫామ్‌లో ఉన్నాడని చోప్రా చెబుతున్నాడు. ఇటీవల జరిగిన 3టీ కప్‌లో డివిలియర్స్ కేవలం 24 బంతుల్లో 61 పరుగులు చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో అతడు తప్పకుండా ఆడతాడని చోప్రా అభిప్రాయపడ్డాడు.