- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి పాత్ర కూడా చేస్తా: మృణాల్
దిశ, వెబ్‌డెస్క్ :బాలీవుడ్ ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ దూసుకుపోతోంది. టెలివిజన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి, సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న భామ.. పాత్రల ఎంపికలో తనదైన ముద్ర వేస్తోందని బీటౌన్ నుంచి కాంప్లిమెంట్స్ కూడా అందుకుంది. ఈ క్రమంలో తనను ఇదే ప్రశ్న అడగ్గా, నిజమే కదా అంటోంది. ప్రేక్షకులు మారారు.. ఒక హీరోయిన్‌ను గ్లామర్ డాల్‌గా రిపిటేటివ్ మూడ్‌లో చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదు. అందుకే ఎంత చిన్న పాత్ర అనేది కాకుండా సినిమాలో ఎంత ఇంపాక్ట్‌ఫుల్ రోల్ అనేది చూస్తాను. అలాంటప్పుడు ఆ పాత్ర హీరోకు సిస్టరా? గర్ల్ ఫ్రెండా? వైఫ్ క్యారెక్టరా? లేదా తల్లి పాత్రనా? అనే విషయంలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోను’ అని చెప్తోంది.
హీరోనే సినిమా లీడ్ చేస్తాడు, అందులో ఇతర పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత లేదనుకుంటే ఆ సినిమాకు ఓకే చెప్పలేను అంటున్న మృణాల్.. సినిమాలో తన పాత్ర ఆడియన్స్‌పై ఇంపాక్ట్ చూపించాలని కోరుకుంటానని చెప్పుకొచ్చింది. మృణాల్ సినిమాలో ఉంటే తప్పకుండా మూవీ చూడాలన్న ఒపీనియన్ ఆడియన్స్‌లో రావాలని.. అందుకోసమే ట్రై చేస్తానని చెప్తోంది. ప్రతి అవకాశాన్ని సువర్ణావకాశంగా మార్చుకునేందుకు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తానంటోంది భామ.
కాగా, కుంకుమ్ భాగ్య సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్.. హృతిక్ ‘సూపర్ 30’ మూవీతో టాక్ ఆఫ్ ది బీటౌన్ అయిపోయింది. ప్రజెంట్ షాహిద్ కపూర్‌కు జోడీగా ‘జెర్సీ’ రీమేక్ చేస్తున్న ఈ యంగ్ టాలెంటెడ్ గర్ల్.. రాజా మీనన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘పిప్పా’ సినిమాలో ఇషాన్ ఖట్టర్‌తో రొమాన్స్ చేయనుంది.