జగిత్యాల కలెక్టర్ కీలక ఆదేశాలు.. తహశీల్దార్లకు స్థానచలనం

by Sridhar Babu |   ( Updated:2021-08-25 11:40:37.0  )
jagityala-collecter-ravi
X

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ధర్మపురిలో పనిచేస్తున్న వై.రవీందర్‌ను కథలపూర్ మండలానికి బదిలీ అయ్యారు.

జగిత్యాల అర్బన్‌లో పనిచేస్తున్న ఎన్.వెంకటేష్ ధర్మపురి మండలానికి, జగిత్యాల రూరల్ పనిచేస్తున్న దిలీప్ నాయక్‌ను అర్బన్ మండల ఇంచార్జిగా బదిలీ చేశారు. సి.రాజమనోహరెడ్డి పెగడపల్లి నుండి జగిత్యాల ఆర్డీవో ఆఫీస్‌లో డీఏఓగా బదిలీ అవ్వగా, మేడిపల్లిలో డిప్యూటీ తహశీల్దార్ పనిచేస్తున్న ఎం.కిరణ్ కుమార్‌ను పెగడపల్లి ఇంచార్జి తహసీల్దార్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ రవి ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Next Story

Most Viewed