వివాహాలకు MRO అనుమతి తప్పనిసరి..

by Shyam |
వివాహాలకు MRO అనుమతి తప్పనిసరి..
X

దిశ, సిద్దిపేట :శ్రావణమాసం ప్రారంభం కావడంతో ఇకనుంచి వివాహాలకోసం అనుమతులు ఇచ్చే బాధ్యత మండల పరిధిలోని తహసీల్దార్లకు అప్పగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. జూలై 21 నుంచే శ్రావణం మాసం మొదలు కాగా, పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అయితే తహసీల్దార్లు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, మరేఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున.. పెళ్లికొడుకు, పెళ్లికూతురు తరఫున 20 మంది మాత్రమే హాజరయ్యేలా చూసుకోవాలని ఆదేశించింది.
పెళ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారు వివాహానికి హాజరయ్యే 20 మంది వివరాలతో పాటు పెళ్లి కార్డు, ఆధార్ కార్డు, కరోనా రిపోర్టులతో పాటు రూ .10 నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పై అఫిడవిట్‌ను ఎమ్మార్వోకు అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించని వారి పై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం జీఓలో స్పష్టంచేసింది.

Advertisement

Next Story