ఎర్రబెల్లి దయాకర్.. రెండేళ్లుగా పింఛన్ దిక్కులేదు ఏం చేస్తున్నావ్..

by Sridhar Babu |
ఎర్రబెల్లి దయాకర్.. రెండేళ్లుగా పింఛన్ దిక్కులేదు ఏం చేస్తున్నావ్..
X

దిశ, కాటారం : కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే ఆసరా పింఛన్లు ఇస్తున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. మిగత ప్రాంతాల్లో ఆసరా పింఛన్లను రెండేళ్లుగా మంజూరు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.

రాష్ట్రంలో రెండేళ్లుగా ఒక్క ఆసరా పింఛన్ కూడా మంజూరు కాకపోవడంతో వృద్దులు, వితంతు మహిళలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క పింఛన్ కూడా ఇవ్వకుండా మొన్న దుబ్బాక, నేడు హుజరాబాద్ ఉప ఎన్నికల కోసం వేలాది ఆసరా పింఛన్లు ఎలా మంజూరు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

మల్హర్ మండలంలో రెండేళ్లుగా 319 మంది అర్హులైన లబ్ధిదారులు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం 57 ఏళ్ళు దాటినా వారికి ఆసరా పింఛన్లు ఇస్తామని చెప్పడం సంతోషమే కానీ, ముందుగా అర్హులైనా వారికి ఆసరా పింఛన్లు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed