- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆహ్వానించి.. అవమానిస్తారా..? ఎమ్మెల్యే వనమాకు హెచ్చరిక
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ రేగా కాంతారావును ఆహ్వానించారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఫొటో ప్లెక్సీ, బ్యానర్లో వేయలేదు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం స్టేజి మీదకు కూడా విప్ రేగాను పిలవకుండా అంబేద్కర్ సాక్షిగా ఆయన్ను ఆహ్వానించి.. అవమానించారని ఎంపీపీల సంఘం అధ్యక్షుడు గుమ్మడి గాంధీ అన్నారు. ఆదివారం మణుగూరు మండలంలో తుడుందెబ్బ నాయకుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో గుమ్మడి గాంధీ మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుని ఆహ్వానించి.. అవమానిస్తారా..అంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రేగాకు ఎంత క్రేజ్ ఉందో కొత్తగూడెం జిల్లాలో కూడా అంతే క్రేజ్ ఉందని సంచలమైన వ్యాఖ్యలు చేశారు.
రేగా కొత్తగూడెం అడ్డా మీద అడుగుపెట్టి ఆదివాసీ జెండా ఎగురవేస్తే దాని పరిస్థితులు వేరేలా ఉంటాయని ఘాటుగా విమర్శించారు. ప్రతీ ఆదివాసి కుటుంబాలకు, నియోజకవర్గ ప్రజలకు రేగా దేవుడని అభివర్ణించారు.కొత్తగూడెం కేంద్రంలోని నడిబొడ్డున అంబేద్కర్ సాక్షిగా ఒక గిరిజన బిడ్డ ప్రభుత్వవిప్ రేగాను అవమానించారని.. ఆ అవమానాన్ని మాత్రం వదిలిపెట్టేదిలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని చీఫ్ సెక్రెటరీకి, అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. నియోజకవర్గంలో పలువురు మేధావుల మాటల ప్రకారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సరైన సఖ్యత ఉండదని చర్చించుకుంటున్నారు. ప్రస్తుత అధికార పార్టీలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు ప్రోటో కాల్స్ ఉండవని గుససలాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్స్ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.