- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాబూ లోకాయ్.. కాస్త లోకజ్ఞానం నేర్చుకో
దిశ, ఏపీ బ్యూరో: తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే అడ్రెస్‌తో ఉన్న ఫారెన్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిమ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు వైఎస్ భారతీ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న కంపెనీలు సూట్ కంపెనీలు కాదా? అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఎద్దేవా చేస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా, ‘బాబూ లోకాయ్… స్టాన్‌ఫర్డ్, కార్నెగీల్లో చదువుకున్నానని అంటావ్.. సొంత పేర్లతో ఉన్న కంపెనీలను సూట్ కేస్ కంపెనీలు అనరు నాయనా. కాస్త లోకజ్ఞానం నేర్చుకో లోకాయ్’ అని ఎద్దేవా చేశారు.
మరో ట్వీట్‌లో ‘లోకాయ్… మీ నాన్న పీఎస్ ఇంటి మీద రైడ్ తర్వాత, 2,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బు అక్రమ మార్గాల్లో లాగేశారన్న నిజాన్ని ఐటీ శాఖ ప్రకటించింది. మొన్న ఢిల్లీలో ఎంపీల్ని రాష్ట్రపతి వద్దకు పంపటానికి అసలు కారణం అదేనా? ఆ 2,000 కోట్లు నువ్వు తిన్నావా, మీ నాన్న తిన్నాడా? లేక జాయింట్ అకౌంటా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.