- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ఈటల రబ్బర్ స్టాంప్: ఉత్తమ్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి భవనం చారిత్రాత్మకమైందని, దీని రక్షణ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కాపాడాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్లూప్రింట్ ప్రకారం ఆస్పత్రి ఆవరణలోనే రూ.600 కోట్ల వ్యయంతో కొత్త భవనం నిర్మించాలని కోరారు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రస్తతం ఇస్తున్న 10 శాతం ఇంటెన్సివ్ 50 శాతం ఇవ్వాలన్నారు.
ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ఉస్మానియా ఆస్పత్రి భవనంలోకి నీరు చేరడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో గురువారం ఉత్తమ్ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఓ రబ్బర్ స్టాంప్ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తింపు పొందిన వైద్యులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, జర్నలిస్టులు, పోలీసులు కరోనా వ్యాధితో మరణిస్తే రూ.50 లక్షలు, అనారోగ్యానికి గురైతే రూ.10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.