రామమందిర నిర్మాణానికి సుజనాచౌదరి భారీ విరాళం..

by srinivas |
రామమందిర నిర్మాణానికి సుజనాచౌదరి భారీ విరాళం..
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. రామాలయ నిర్మాణం కోసం బీజేపీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహిస్తున్నారు. దేశ ప్రజలందరూ రామమందిర నిర్మాణానికి భాగస్వాములు అవుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కుటుంబం కూడా అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళం ఇచ్చింది. ఎంపీ సుజనా కుటుంబం తరపున రూ.2.2 కోట్ల విరాళం ఇచ్చారు. తన తండ్రి యలమంచిలి జనార్థనరావు పేరు మీద ఎంపీ సుజనాచౌదరి రూ.2 కోట్ల 2 లక్షల 32 వేలు విరాళంగా ఇచ్చారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రూ.5 లక్షలు, సీసీఎల్‌ గ్రూప్ రూ.6 కోట్ల 39 లక్షలు, సిద్ధార్థ అకాడమీ తరపున రూ.15 లక్షలు విరాళం ఇచ్చారు.

Advertisement

Next Story