- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MP Arvind: సీఎంకు అది తప్ప.. ఇంకేం తెల్వదు: ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: హెచ్సీయూ(HCU) భూములపై క్యాంపస్ (Campus)లో విద్యార్థులు గళమెత్తారు. ఈ మేరకు ఇవాళ మొత్తం తరగతుల బహిష్కరణకు విద్యార్థి సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా నిరసనలను మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే హెచ్సీయూ (HCU)లో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములను పరిశీలించి అక్కడున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు బీజేపీ (BJP) నేతలు హెచ్‌సీయూకి బయలుదేరేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా పోలీసులు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో హౌజ్ అరెస్ట్ చేశారు. ఇక ఎమ్మెల్యే క్వార్టర్స్ (MLA Quarter)ను పోలీసులు చుట్టుముట్టి.. అక్కడి వచ్చిన ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి రియల్ ఎస్టేట్ తప్ప.. ఇంకేం తెలియదంటూ ఫైర్ అయ్యారు. అందుకే హెచ్‌సీయూ (HCU) భూములను వేలం వేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఆ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్‌యూఐ (NSUI) కూడా వ్యతిరేకిస్తోందని కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) కమీషన్ తీసుకోకపోతే.. సీఎం రేవంత్ వెంటనే భూముల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ (HCU)లో ప్రభుత్వ చర్యలతో అక్కడున్న జింకలు, నెమళ్లు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.