- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకండ్ డోసు తీసుకున్న ఎంపీ.. ప్రజలకు ఏం చెప్పారంటే..!
దిశ, బోథ్ : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు అన్నారు. సోమవారం covid -19 రెండో డోసును ఆయన తీసుకున్నారు. ఈ సందర్భంగా అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి .. నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి రిమ్స్ డైరెక్టర్ బలరాం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్‌తో ఎంపీ సమీక్షించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో సామాన్యులకు సరైన వైద్యం అందడం లేదని ముఖ్యంగా అత్యవసర రోగులకు ఇవ్వాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వడం లేదని, రోగుల అవస్థలు పట్టించుకోవడం లేదని ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కరోనా నియంత్రణకు వేల కోట్లు ఖర్చు చేస్తూ రెండు డోసులు టీకాలను ఉద్యమంలా నిర్వహిస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశమంతటా కరోనా వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సామాన్యులకు ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఎంపీ సోయం బాపురావు కోరారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఎంపీ వెంట ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు గోర్ల రాజు యాదవ్, బీజేపీ నాయకులు జివి రమణ తదితరులు ఉన్నారు.