- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మొద్దు నిద్ర వీడి టిమ్స్ ప్రారంభించాలి: రేవంత్
దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్ మొద్దు నిద్ర వీడి టిమ్స్‌ను ప్రారంభించి గాంధీ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రపంచంలో అత్యాధునిక వైద్యశాలగా తీర్చిదిద్దుతామన్న టిమ్స్‌లో రోగులకు బదులు కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. ఆదివారం గచ్చిబౌలి టిమ్స్‌ను సందర్శించిన ఎంపీ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గచ్చిబౌలి టిమ్స్‌లో చెత్త, నలుగురు సెక్యూరిటీ, ఓ కుక్క తప్ప ఎవరూ లేరన్నారు. దేశానికే తలమానికంగా చెప్పుకున్న టిమ్స్‌లో మురుగు నీరు వ్యవస్థ కూడా లేదన్నారు. ప్రభుత్వం చెప్పిన 100మంది డాక్టర్లు, ప్రపంచ అత్యాధునిక వైద్యం ఎక్కడుందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదనటానికి టిమ్స్ ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
తెలంగాణలో ఇప్పటివరకు 50వేల కరోనా టెస్టులు కూడా చేయలేదని, ఏపీలో 5.50 లక్షల టెస్టులు చేశారన్నారు. దేశంలో అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణలో 22వ స్థానంలో ఉందని, మరణాల రేటులో దేశంలోనే తెలంగాణ ముందుందన్నారు. వైద్యశాఖ మంత్రిని పొలాల్లో దిష్టిబొమ్మగా, తొలుబొమ్మగా చేశారని రేవంత్ ఆరోపించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఎలాంటి ప్రణాళిక లేకుండా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.